తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ ప్రాణాలు బలితీసుకుంటోంది. తాజాగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో వరుస కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. 36 గంటల వ్యవధిలో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు 8మంది మృతి చెందారు.
తెలంగాణ: ఐసోలేషన్ కేంద్రంలో 11 మంది మృతి - మంచిర్యాలలో కరోనా మృతుల సంఖ్య
తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో 36 గంటల వ్యవధిలో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. పరిస్థితి విషమించిన తర్వాత ఐసోలేషన్‌కు రావడం వల్లనే మృతుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు తెలిపారు.
ఐసోలేషన్ కేంద్రంలో 11 మంది మృతి
ఇవాళ ఉదయం 8 నుంచి ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఐసోలేషన్‌కు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. పరిస్థితి విషమించిన తర్వాత ఐసోలేషన్‌కు రావడం వల్లనే మృతుల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: