ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Top news: ప్రధాన వార్తలు@7PM - ప్రధాన వార్తలు

.

7pm_Topnews
7pm_Topnews

By

Published : Dec 13, 2021, 6:58 PM IST

  • Chandrababu on OTS: ఓటీఎస్ వసూళ్లు.. పేదల మెడకు ఉరితాళ్లు : చంద్రబాబు
    Chandrababu on OTS: రాష్ట్రంలో ఓటీఎస్ వసూళ్లు.. పేదల మెడకు ఉరితాళ్లుగా మారాయని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ రెడ్డి.. ఓటీఎస్ పేరుతో పేదల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తిన చంద్రబాబు.. పేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో.. ఆ నెల 20, 23 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందకుండా ఆంక్షలు అమలు చేయండి - సీఎం జగన్
    CM Jagan On Omicron: రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వ్యాప్తిచెందకుండా ఆంక్షలు అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా పరిస్థితి, వైద్యారోగ్య శాఖపై సమీక్షించిన ఆయన.. ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. వ్యాక్సినేషన్ పూర్తికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Modi lunch: కార్మికుల మధ్య కూర్చొని భోజనం చేసిన మోదీ
    Modi lunch: కాశీ విశ్వనాథ్​ కారిడార్​ నిర్మాణంలో భాగస్వామ్యులైన కార్మికులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ లంచ్​ చేశారు. సాధారణ పౌరుడిలానే వాళ్ల మధ్య కూర్చొని ప్రధాని భోజనం చేయడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మోదీ ఫొటోతో 100కోట్ల మందికి లేని ఇబ్బంది మీకే ఎందుకు?'
    PM photo on vaccination certificate: కరోనా వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్​పై ప్రధాని మోదీ ఫొటోను తొలగించాలని దాఖలైన పిటిషన్​ విచారణ అర్హతపై పరిశీలన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది కేరళ హైకోర్టు. మోదీ చిత్రపటంతో దేశంలోని 100 కోట్ల మందికి లేని ఇబ్బంది మీకే ఎందుకని పటిషనర్​ను ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బ్రిటన్‌లో తొలి 'ఒమిక్రాన్‌' మరణం
    Omicron Death In UK: బ్రిటన్​లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైనట్లు ఆ దేశ ప్రధాని బోరిస్​ జాన్​సన్ వెల్లడించారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా 63 దేశాలకు వ్యాపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్'​గా వార్నర్​
    ICC Player of The Month: నవంబర్​ నెలకు గానూ 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్' అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​తో పాటు మహిళల్లో వెస్టిండీస్​​ ఆల్​రౌండర్​ హేలీ మ్యాథ్యూస్​ విజేతలుగా నిలిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అది చేసింది నేనేనా అనిపిస్తుంది: రష్మిక
    హీరోయిన్ రష్మిక.. 'పుష్ప' సినిమా విశేషాలు పంచుకుంది. అల్లు అర్జున్​తో నటించాలనే కల నెరవేరిందని చెప్పుకొచ్చింది. మాస్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా.. డిసెంబరు 17న పాన్ ఇండియా రేంజ్​లో రిలీజ్ కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details