రాష్ట్రంలో కొత్తగా 6,224 కరోనా కేసులు.. 41 మరణాలు - కరోనావైరస్ లక్షణాలు
17:57 October 03
వైరస్‌కు మరో 41 మంది మృతి
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమేణా తగ్గుతున్నాయి . గడిచిన 24 గంటల వ్యవధిలో 6,224 మందికి కరోనా సోకినట్టుగా వైద్యారోగ్యశాఖ తెలిపింది. వైరస్ కారణంగా కొత్తగా.. 41 మంది మృతి చెందారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 11.84గా నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోందని స్పష్టం చేసింది.
అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 890 మందికి కరోనా సోకింది. తూర్పుగోదావరిలో 824 మంది, చిత్తూరులో 827 మందికి కరోనా సోకింది. ఇక అనంతపురంలో 282 మందికి, గుంటూరు-491, కడప-491, కృష్ణా-392, కర్నూలు-225 , నెల్లూరు-558, ప్రకాశం-619, శ్రీకాకుళం-175, విశాఖపట్నం-225, విజయనగరం-225 మందికి వైరస్ సోకినట్టుగా బులెటిన్ లో పేర్కొంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7 లక్షల 13 వేల 14కు చేరింది. ఇక రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 55 వేల 282 గా వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 7వేల 798 మంది పూర్తిగా కోలుకున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6 లక్షల 51 వేల 791కి పెరిగింది.
కరోనా కారణంగా కొత్తగా 41 మంది మృతి చెందారు. కృష్ణా జిల్లాలో 6గురు, చిత్తూరు-5, తూర్పుగోదావరి-5, గుంటూరు-4, ప్రకాశం-4, విశాఖ-4, నెల్లూరు-3, అనంతపురం-2, కడప-2, కర్నూలు-2, శ్రీకాకుళం-2, విజయనగరం-1, పశ్చిమగోదావరిలో ఒకరు చొప్పున మృతి చెందారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5941కి చేరింది.