ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 65 మంది మృతి - coronavirus latest news

corona-cases-in-ap
corona-cases-in-ap

By

Published : Jul 22, 2020, 5:15 PM IST

Updated : Jul 22, 2020, 6:53 PM IST

17:14 July 22

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. మరోసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కొత్తగా 6వేల 45 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మొత్తం బాధితుల సంఖ్య 64 వేల 713కు చేరింది. మహమ్మారి దెబ్బకు 65 మంది బలవగా.. మరణాల సంఖ్య 823కు పెరిగింది.

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో కేసులు గరిష్ఠ స్థాయికి చేరాయి. 24 గంటల వ్యవధిలో 49 వేల 553 మందికి కరోనా పరీక్షలు  నిర్వహించగా....6వేల 45 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. విశాఖలో అత్యధికంగా  వెయ్యి 49 కేసులు నమోదయ్యాయి.  తూర్పుగోదావరిలో 891, గుంటూరు జిల్లాలో 842 కేసులు వచ్చాయి. కర్నూలులో 678, పశ్చిమగోదావరిలో672, చిత్తూరులో 345, నెల్లూరు జిల్లాలో 327 , అనంతపురం జిల్లాలో 325 మందికి కొత్తగా కరోనా సోకింది. శ్రీకాకుళం జిల్లాలో 252 , కడపలో 229, ప్రకాశంలో 177 కేసులు వచ్చాయి. కృష్ణాలో 151, విజయనగరం జిల్లాలో 107 మందికి పాజిటివ్‌ తేలింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 14 లక్షల 35 వేల 827 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

కరోనా మరణాల సంఖ్య భారీగానే నమోదైంది. మహమ్మారి దెబ్బకు 65 మంది చనిపోగా.... మొత్తంగా మృతుల సంఖ్య 823కు పెరిగింది. గుంటూరులో  అత్యధికంగా 15మంది చనిపోయారు. కృష్ణాలో 10 , పశ్చిమగోదావరిలో 8 మంది, తూర్పుగోదావరిలో ఏడుగురు మృతి చెందారు.  చిత్తూరు, కర్నూలులో ఐదుగురు , విజయనగరంలో నలుగురు బలయ్యారు. ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున ...కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.

పరిస్థితి తీవ్రత దృష్ట్యా జిల్లాల్లో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశాఖలో పోలీసులు ప్రత్యేక కార్యచరణతో ముందుకుసాగుతున్నారు. కొవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో అన్ని దుకాణాలను వారం పాటు మూసివేయాలని  నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సంజీవిని  బస్సులో అనుమానితులకు  కొవిడ్ పరీక్షలు చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఇళ్ల మధ్య కొవిడ్‌ హాస్పిటల్  పెట్టారంటూ  ప్రజలు ఆందోళన చేయగా అధికారులు వారికి నచ్చజెప్పి పంపించారు. దర్శిలో కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. దుకాణాలను  మూసివేశారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లి సామాజిక ఆరోగ్య కేంద్ర  సిబ్బందికి  కరోనా వచ్చినా  అధికారులు శానిటైజ్ చేయలేదని  వైద్యులు వాపోయారు. విజయనగరంలో కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి అండగా ఉండేందుకు సేవా సంస్థల సభ్యులు శానిటైజర్లు, వైద్య కిట్లను అందించారు.

ఇదీ చదవండి:నిమ్మగడ్డ వ్యవహారం: తొలగింపు నుంచి తిరిగి నియమించేదాకా....

Last Updated : Jul 22, 2020, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details