ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 6,026 కేసులు...52 మంది మృతి - corona deaths in telangana

తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కొత్తగా 6,026 కరోనా కేసులు నమోదు కాగా... మరో 52 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ts corona cases
తెలంగాణలో కరోన కేసులు

By

Published : May 6, 2021, 10:50 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 6,026 కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్‌ బారిన పడిన మరో 52 మంది మృతిచెందారని పేర్కొంది. కొవిడ్‌ నుంచి కొత్తగా 6,551 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 77,127 క్రియాశీల కేసులు ఉన్నాయని తెలిపింది.

నిన్న ఒక్కరోజే 79,824 పరీక్షలు నిర్వహించగా... తాజాగా 6,026 కేసులు నిర్ధరణ అయ్యాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 1,115 మందికి పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. మేడ్చల్‌ జిల్లాలో 418, రంగారెడ్డి జిల్లాలో 403 కేసులు వెలుగుచూశాయి.

ఇదీ చూడండి:

కరోనా విలయం.. మరోసారి 4 లక్షలకు పైగా కేసులు

కరోనాతో ఆర్​ఎల్​డీ చీఫ్ మృతి- మోదీ సంతాపం

ABOUT THE AUTHOR

...view details