కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 6,28,313 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు జేసీ కె.మాధవీలత తెలిపారు. వీటిలో 5,597 టన్నుల తడిసిన, రంగు మారిన ధాన్యం ఉన్నట్టు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల విషయమై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు నగరంలోని విడిది కార్యాలయం నుంచి శనివారం ‘డయల్ యువర్ జాయింటు కలెక్టరు’ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 75,715 మంది రైతులకు రూ.893.41 కోట్ల మేర చెల్లించినట్టు చెప్పారు.
కృష్ణా జిల్లాలో 6.28 లక్షల టన్నుల ధాన్యం సేకరణ - Krishna district newsupdates
కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 6,28,313 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు జేసీ కె.మాధవీలత తెలిపారు. వీటిలో 5,597 టన్నుల తడిసిన, రంగు మారిన ధాన్యం ఉన్నట్టు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల విషయమై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు నగరంలోని విడిది కార్యాలయం నుంచి శనివారం ‘డయల్ యువర్ జాయింటు కలెక్టరు’ కార్యక్రమం నిర్వహించారు.
ధాన్యం విక్రయించిన రైతులకు సొమ్ము చెల్లింపుల నిమిత్తం త్వరితగతిన బ్యాంకులకు జమ చేసేలా చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 8 మంది ఫోన్లు చేయగా, వీటిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముగ్గురు తమ సమస్యలు తెలియజేశారు. నందిగామ మండలం మాగల్లు గ్రామానికి చెందిన ఎస్.రామబ్రహ్మం మాట్లాడుతూ.. తనకు రవాణా ఛార్జీలు చెల్లించలేదని తెలిపారు. దీనిపై జేసీ స్పందిస్తూ.. తప్పనిసరిగా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు కె.రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.