విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు 5వ రోజూ కన్నుల పండుగగా సాగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రమైన ఇవాళ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. జగన్మాతను దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా 13 వేల మందికి ఆన్ లైన్ లో టికెట్లు జారీ చేసిన అధికారులు, అప్పటికప్పుడు వచ్చే భక్తుల కోసం 100, 300రూపాయల టికెట్లు క్యూ లైన్లలో జారీ చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు...సరస్వతీదేవిగా దుర్గమ్మ దర్శనం - విజయదశమి 2020
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఐదో రోజు దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సరస్వతిదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో దర్శనానికి అధికసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
సరస్వతీదేవిగా బెజవాడ దుర్గమ్మ