ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - breaking news

...

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Nov 10, 2020, 5:00 PM IST

  • తెలంగాణ: దుబ్బాకలో భాజపా జయకేతనం
    దుబ్బాకలో ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ముగిసింది. చివరి వరకు ఉత్కంఠ రేకెత్తించిన ఈ ఎన్నికల పోరులో భాజపా విజయభేరి మోగించింది. తెరాస అభ్యర్థి సుజాతపై భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. తెరాసపై 1068 ఓట్ల మెజార్టీతో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బిహార్​ తీర్పు: అటు ఆనందం- ఇటు అసంతృప్తి

బిహార్​ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముందుకు సాగే కొద్దీ ఎన్​డీఏ ఆధిక్యంలోకి దూసుకుపోతోంది. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు తారుమారవుతుండటం వల్ల భాజపా శ్రేణులు పార్టీ కార్యాలయాలకు భారీగా తరలివెళ్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కృష్ణాయపాలెం రైతుల బెయిల్ పిటిషిన్ రేపటికి వాయిదా
    కృష్ణాయపాలెం రైతులపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'నంద్యాల ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి'
    రాష్ట్రంలో వైకాపా నేతల వేధింపులకు అంతేలేకుండా పోయిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. ఎస్సీలు, మైనార్టీలను పనిగట్టుకుని వేధించడమే జగన్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆ కంపెనీలు దోచుకునేందుకే నూతన వ్యవసాయ చట్టాలు'
    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అనంతపురంలో రైతులతో కలిసి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రియురాలి శరీరాన్ని కట్ చేసి.. గోనెసంచిలో కుక్కి..!
    రెండున్నర ఏళ్ల కిందట బీటెక్ విద్యార్థిని నజీమా అదృశ్యమైంది. అప్పటినుంచి కేసును ఛేదించే పనిలో పడ్డ పోలీసులు.. తాజాగా చిక్కుముడిని విప్పారు. అయితే ఆ విద్యార్థిని అదృశ్యానికి కారణాలు, చంపేసిన విధానాన్ని తెలుసుకుని పోలీసులే షాకయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బలమైన సైనిక శక్తితోనే శాంతి స్థాపన: రావత్
    దేశ రక్షణ, సమగ్రత, ప్రజల భద్రతకు బలమైన సాయుధ దళాలు అవసరమని పేర్కొన్నారు త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​. శాంతి స్థాపన కోసం సైనిక సామర్థ్యాలను పెంపొందించటం కొనసాగించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పెరిగిన ధరలతో బంగారు రుణాలకు భలే డిమాండ్!
    కరోనా కాలంలో బంగారం రుణాలకు డిమాండ్ భారీగా పెరిగినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు ఇందుకు కారణంగా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐపీఎల్: అదే నిజమైతే దిల్లీనే ఛాంపియన్!
    ఐపీఎల్ తుదిసమరానికి అంతా సిద్ధమైంది. దుబాయ్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్​తో దిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. లీగ్ ప్రారంభం నాటి నుంచి ఈసారి తొలిసారి ఫైనల్​లో అడుగుపెట్టింది దిల్లీ. ఈ క్రమంలో ఆ జట్టు నాకౌట్​ ప్రదర్శనలపై ఓసారి లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చిరంజీవి త్వరగా కోలుకోవాలని పవన్​ ప్రార్థన
    తన అన్నయ్య చిరంజీవి త్వరగా కోలుకోవాలని పవన్ కల్యాణ్ ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు ఓ నోట్​ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details