ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - తెలుగు ప్రధాన వార్తలు

.

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5pm

By

Published : Sep 23, 2020, 4:58 PM IST

  • 'మోదీ సతీసమేతంగా పూజలు చేశారా?'
    హిందూ దేవాలయాలపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వేడి చల్లారక ముందే... మంత్రి మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. తన బర్తరఫ్ డిమాండ్ చేస్తున్న భాజపా లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'డిక్లరేషన్​పై సంతకం చేయాలి'
    సీఎం జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు డిక్లరేషన్​పై సంతకం చేసి.. అందరి మనోభావాలు గౌరవిస్తామని నిరూపించుకోవాలని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు హితవు పలికారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'నా రక్తం తాగారు'
    తనను బెదిరిస్తున్నవారి మాటలను సుమోటోగా తీసుకొని వారి వెనుకున్న వారిని గుర్తించి శిక్షించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయస్థానాన్ని కోరారు. మరోసారి వైకాపా నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పటిష్ఠ ఏర్పాట్లు
    తిరుమల శ్రీవారి బ్రహోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు రాత్రి 7 గంటలకు ఉత్సవాల్లో ప్రధానమైన గరుడ సేవ జరగనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సుప్రీంలో ఊరట
    ఫేస్​బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు అజిత్ మోహన్​పై అక్టోబర్ 15 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని దిల్లీ అసెంబ్లీ కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • చిగురుటాకులా ముంబయి
    మహారాష్ట్రలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబయి సహా పలు నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఉచితంగా రష్యా వ్యాక్సిన్!
    రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్​ను... ఐక్యరాజ్య సమితి(ఐరాస), దాని అనుబంధ సంస్థల సిబ్బందికి ఉచితంగా అందిస్తామని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ ప్రకటించారు. అయితే ఐరాస మాత్రం దీనిపై స్పందించలేదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • లాభాలు ఆవిరి
    స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 66 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 22 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. భారతీ ఎయిర్​టెల్ షేర్లు భారీగా నష్టపోయాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • జోఫ్రా జోస్యం ...!
    ఇంగ్లాండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్​కు మానవాతీత శక్తులున్నాయా? మరి జరగబోయే విషయాలను గతంలోనే ఎలా ఊహించాడు? క్రికెట్​కే పరిమితం కాకుండా ట్విట్టర్​లో ప్రపంచవ్యాప్తంగా జరిగే విషయాలపై అతడు చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు వైరల్ అవుతుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అనురాగ్​ కశ్యప్​పై ఎఫ్​ఐఆర్​
    డైరెక్టర్​ అనురాగ్​ కశ్యప్​పై ఎఫ్​ఐఆర్​ నమోదైంది. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ నటి పాయల్​ ఘోష్​ కేసు పెట్టిన కారణంగా త్వరలో అతడిని విచారణకు పిలవనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details