ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదు - కరోనావైరస్ చికిత్స

రాష్ట్రంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. మరోసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కొత్తగా 5 వేల 41 కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 49 వేల 650కి చేరాయి. వైరస్ కారణంగా మరో 56 మంది బలయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 642కు చేరింది.

5041 new corona cases registered in andhrapradesh
5041 new corona cases registered in andhrapradesh

By

Published : Jul 19, 2020, 7:29 PM IST

Updated : Jul 19, 2020, 10:44 PM IST

రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదు

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 31 వేల 148 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా.. 5 వేల 41 మందికి వైరస్‌ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 49 వేల 650కి చేరింది. కొవిడ్‌ కాటుకు మరో 56 మంది బలవ్వగా.. రాష్ట్రంలో మృతుల సంఖ్య 642కి చేరింది.

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 10మంది, శ్రీకాకుళంలో 8 మంది, కర్నూలు, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఏడుగురు చొప్పున, ప్రకాశం జిల్లాలో నలుగురు, అనంతపురం, కడప, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. కొత్తగా 11 వందల ఆరుగురు డిశ్ఛార్జి అవ్వగా.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 22 వేల 890 మంది ఇళ్లకు వెళ్లారు. ఇంకా 26 వేల 118 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 లక్షల 15 వేల 532 మందికి నిర్ధరణ పరీక్షలు చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. జిల్లాలో అత్యధికంగా 647.. అనంతపురం జిల్లాలో 637.. శ్రీకాకుళం జిల్లాలో 535.. చిత్తూరు జిల్లాలో 440.. కృష్ణా జిల్లాలో 397.. పశ్చిమ గోదావరి జిల్లాలో 393.. నెల్లూరు జిల్లాలో 391.. కర్నూలు జిల్లాలో 364.. గుంటూరు జిల్లాలో 354.. విశాఖ జిల్లాలో 266.. విజయనగరం జిల్లాలో 241.. కడప జిల్లాలో 226.. ప్రకాశంలో 150 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు.

ఇదీ చదవండి: నల్ల చిరుత ఫొటో వెనుక ఉంది అతనే

Last Updated : Jul 19, 2020, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details