'రాజకీయ ప్రమేయం లేకుండా పింఛన్లు' - 'ఎన్టీఆర్ భరోసా'
పింఛన్లపై తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేస్తోన్న విధానాలపై, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. వృద్ధులకు భద్రతా కల్పించడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం 'ఎన్టీఆర్ భరోసా' పేరుతో 54లక్షల47 వేల మందికి పెన్షన్లను అందిస్తోందన్నారు.
200 రూపాయలు ఉన్న పింఛన్‌ను పది రెట్లు పెంచి 2వేలు చేశామన్నారు. లోటు బడ్జెట్ ఉన్నా పింఛన్లుపెంచుతూ చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో వృద్ధులు, వితంతువులకు దక్కాల్సిన పింఛన్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు రాజకీయ ప్రమేయమే లేకుండా అన్నీ ఆన్లైన్లో పారదర్శకంగా పంపిణీ జరుగుతోందని చెప్పారు. నాలుగున్నరేళ్లల్లో ఎన్టీఆర్ భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం 24 వేల 618 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తే, కేంద్రం కేవలం 11వందల కోట్లే ఇచ్చిందని కళా లేఖలో పేర్కొన్నారు.