రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతుంది. సెకండ్ వేవ్‌లో తొలిసారిగా 5 వేల కేసులు దాటాయి. కొత్తగా 5,086 కరోనా కేసులు నమోదవ్వగా 14 మంది వైరస్‌కు బలయ్యారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపురం, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.
కరోనా సెకండ్ వేవ్: రాష్ట్రంలో ఒక్కరోజులో.. 5 వేలు దాటిన కొవిడ్ కేసులు - కరోనా తాజా కేసులు న్యూస్
corona cases
17:19 April 15
వైరస్‌తో మరో 14 మంది మృతి
కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో.. మరో 1,745 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 31,710 కోవిడ్ యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. 24 గంటల్లో 35,741 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు తాజా బులెటిన్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి:
Last Updated : Apr 15, 2021, 5:40 PM IST