ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

30 లోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు వాయిదాల ఆస్తిపన్నును ఈ నెల 30లోగా ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందు వల్ల ఈ ఏడాది పన్నులను ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం కల్పించారు.

30 లోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ
30 లోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ

By

Published : Apr 12, 2020, 8:22 AM IST

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు వాయిదాల ఆస్తి పన్నును ఈ నెల 30 లోగా ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరాన్ని జూన్‌ వరకు పొడగించినప్పటికీ పురపాలకశాఖ 2019-20 ఆర్థిక సంవత్సరం పన్నుల చెల్లింపులను మార్చితో ముగించింది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందు వల్ల ఈ ఏడాది పన్నులను ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం కల్పించారు. నగర, పురసేవా యాప్‌ను దీనికోసం అందుబాటులోకి తెచ్చారు. చెక్కుల రూపంలోనూ పన్నులు చెల్లించే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో ఎంత పన్ను చెల్లించాలో తెలుసుకుని దగ్గర్లోని సచివాలయాల్లో ఈనెల 25లోగా చెక్కులు అందజేయాలని పురపాలకశాఖ ఆర్డీ కె.వెంకటేశ్వరరావు ప్రజలను కోరారు. ఐదు శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:పన్ను వసూళ్లలో అలక్ష్యం...!

ABOUT THE AUTHOR

...view details