మెదక్ జిల్లా మంజీరా నది పాయ అవతల వరదలో చిక్కుకున్న ఐదుగురిని అధికారులు కాపాడారు. అందులో ఇద్దరు కాపలాదారులతో పాటు ముగ్గురు కూలీలు ఉన్నారు. రెండ్రోజుల నుంచి వ్యవసాయ క్షేత్రంలోనే వారు ఉండిపోయారు. సింగూరు గేట్లు ఎత్తడం వల్ల పొంగి పొర్లుతున్న మంజీరా నది ప్రవాహంతో వారు అక్కడే ఉండి పోయారు. గురువారం కాస్త ప్రవాహం తగ్గడం వల్ల వారు రావడానికి ప్రయత్నం చేశారు.
తెలంగాణ: వరదలో చిక్కుకున్న ఐదుగురిని కాపాడిన అధికారులు - మంజీరా వరదలో ఐదుగురు బాధితులు
మెదక్ జిల్లా మంజీరా నది పాయ అవతల వరదలో చిక్కుకున్న ఐదుగురిని అధికారులు కాపాడారు. అందులో ఇద్దరు కాపలాదారులతో పాటు ముగ్గురు కూలీలు ఉన్నారు.
ఐదుగురిని కాపాడిన అధికారులు
వాగు మధ్యలోకి రాగానే ప్రవాహం ఎక్కువ కావడం వల్ల వారు రాయిపై నిల్చున్నారు. ఘటన స్థలికి ఆర్డీవో సాయిరాం వచ్చి పరిస్థితిని సమీక్షించారు. హెలికాప్టర్ తెప్పించి వరదలో చిక్కుకున్న బాధితులను ఒడ్డుకు చేర్చారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 1,432 కరోనా కేసులు.. 8 మరణాలు