ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా వ్యాక్సినేషన్: రాష్ట్రానికి 5 లక్షల డోసుల టీకా - ఏపీ కరోనా కేసులు న్యూస్

రాష్ట్రానికి కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు రాబోతున్నాయి. దిల్లీ నుంచి అందిన సమాచారం ప్రకారం తొలివిడత కింద సుమారు 5 లక్షల డోసులు రానున్నాయి. ఇందులో సుమారు 4 లక్షల డోసులు పుణెలోని సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ టీకా ఉన్నట్లు సమాచారం.

5 lakhs covid-19 vaccine doses for andhrapradesh
5 lakhs covid-19 vaccine doses for andhrapradesh

By

Published : Jan 12, 2021, 7:23 AM IST

రాష్ట్రానికి కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు రానున్నాయి. హైదరాబాద్‌లోని భారత బయోటెక్‌ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ కూడా రాష్ట్రానికి రాబోతుంది. ఆయా టీకా డోసులను సంబంధిత జిల్లాలకు పంపించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తొలివిడత కింద 3,82,899 మంది ఆరోగ్య సిబ్బందికి టీకా వేస్తారు. వీరి వివరాలను కొవిన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. మొత్తం 1,940 పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అర్హులందరికీ టీకా వేయాలంటే 40,410 కేంద్రాలు అవసరం అవుతాయని అంచనా. 17,775 మందికి వ్యాక్సినేటర్లను సిద్ధం చేశారు.

కనిష్ఠ స్థాయికి కరోనా కేసులు

రాష్ట్రంలో కనిష్ఠ సాయిలో.. 121 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 30,933 నమూనాలు పరీక్షించారు. 121 (0.39%) మందికి పాజిటివ్‌గా తేలింది. విజయనగరం జిల్లాలో ఒక్క కేసూ రాలేదు. కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఇదీ చదవండి:

పంచాయతీ పోరుపై ఎస్‌ఈసీ ఉత్తర్వుల సస్పెన్షన్‌

ABOUT THE AUTHOR

...view details