రాష్ట్రంలో కొత్తగా 497 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య 10 వేల 331కు చేరింది. స్థానికంగా ఉంటున్న 448 మందికి, విదేశాల నుంచి వచ్చిన 12 మందితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 37 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తాజాగా వైరస్ కారణంగా 10 మంది మృతి చెందగా.. మెుత్తం మృతుల సంఖ్య 129 మందికి చేరింది. ప్రస్తుతం 5 వేల 423 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో 36,047 మందికి కరోనా పరీక్షలు చేశారు.
- జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు