AP CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 432 కరోనా కేసులు, 5 మరణాలు - కరోనా కేసులు వార్తలు
16:11 October 17
రాష్ట్రంలో ప్రస్తుతం 6034 యాక్టివ్ కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 432 కరోనా కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 586 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం 6,034 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 29,243 కరోనా పరీక్షలు చేశారు. కరోనాతో కృష్ణా జిల్లాలో ఇద్దరు మృతిచెందగా.. చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కక్కరు చొప్పున మరణించారు.
ఇదీ చదవండి:
TDP Conference: సీమకు నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాటం: బాలకృష్ణ