కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 6 వేల 19 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6లక్షల 66వేల 433 మంది కాగా.....51వేల 60మంది చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో 56వేల 145 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 61లక్షల 50వేల 351 మందికి కరోనా పరీక్షలు జరిపినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్రంలో కొత్తగా 4,256 కరోనా కేసులు నమోదు - భారతదేశంలో కరోనా వైరస్
![రాష్ట్రంలో కొత్తగా 4,256 కరోనా కేసులు నమోదు 4256 new corona cases registered in andhrapradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9060260-160-9060260-1601903558150.jpg)
18:32 October 05
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 4వేల 256 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కాటుకు మరో 38మంది బలయ్యారు. మొత్తం బాధితుల సంఖ్య 7లక్షల 23వేల 512కు చేరింది.
తూర్పుగోదావరి జిల్లాలో 853 కేసులు నమోదు కాగా... ప్రకాశం-666, పశ్చిమ గోదావరి-513 మందికి వైరస్ సోకింది. గుంటూరు జిల్లాలో 444, నెల్లూరు -365 మంది కొవిడ్ బారినపడ్డారు. అనంతపురం-271, చిత్తూరు -224, కడప -231, కర్నూలు జిల్లాలో 86 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 179, విశాఖ-138, విజయనగరంలో 129...శ్రీకాకుళం జిల్లాలో 157మందికి వైరస్ సోకింది.
కృష్ణా జిల్లాలో మరో ఏడుగురు కొవిడ్ కాటుకు బలయ్యారు. చిత్తూరు, కడప జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, విశాఖ జిల్లాల్లో నలుగురు చొప్పున మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. పశ్చిమగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున కొవిడ్ మహమ్మారికి బలయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.