ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రానికి వచ్చింది 40 వేల మంది - వలస కూలీల కోసం ప్రత్యేక రైళ్లు వార్తలు

లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తూ ఇచ్చిన వెసులుబాటు వల్ల విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి విమానాలు, రైళ్ల ద్వారా రాష్ట్రానికి సుమారు 40 వేల మంది చేరుకున్నారు. ఇందులో అత్యధికులు వలస కార్మికులే. తెలంగాణ నుంచి 12,000 కర్ణాటక- 2,000, మహారాష్ట్ర-500, దిల్లీ-300, ఒడిశా నుంచి 150 మందితోపాటు అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, బిహార్‌, గుజరాత్‌, హరియాణా, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, లద్దాఖ్‌ల నుంచి కూడా వలస కార్మికులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. అమెరికా, ఐర్లండ్‌, కువైట్‌, సౌదీఅరేబియా తదితర దేశాల నుంచి 1,000 మంది వచ్చినట్లు సమాచారం.

40 thousand people came to andhrapradesh with trains and flights
40 thousand people came to andhrapradesh with trains and flights

By

Published : Jun 8, 2020, 7:25 AM IST

ఇలా చేరుకున్నారు..
* అంతర్జాతీయ విమానాల ద్వారా 1,000
* దేశీయ విమానాలు 749
* ప్రత్యేక, శ్రామిక్‌ రైళ్ళు 7,400
* రోడ్డు మార్గం 27,000
* ఇతరులు నడక, ఇతర రూపాల్లో రాష్ట్రానికి వచ్చారు.

వైద్య పరీక్షలు ఇలా..
* కరోనా వైరస్‌ సోకిందా లేదా అన్నది గుర్తించేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో 17వేల మందికి పరీక్షలు చేశారు. మిగిలినవారికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. హోం క్వారంటైన్‌లో 18,667, ప్రభుత్వ క్వారంటైన్లలో 15వేల మంది ఉన్నారు.
* పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 741 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో 131 మంది కరోనా బారిన పడ్డవారే.
* జ్వరం, దగ్గు లాంటి లక్షణాలతో 63వేల మంది ఔషధ దుకాణాల నుంచి మందులు కొన్నట్లు ‘ఫార్మసీ యాప్‌’లో నమోదుకాగా వీరిలో 57,053 మందిని వైద్య సిబ్బంది సంప్రదించారు. 823 మందికి పరీక్షలు చేస్తే 12 మందికి పాజిటివ్‌, 584 మందికి నెగిటివ్‌ అని నిర్ధారణ అయింది. మిగిలిన పరీక్షల వివరాలు తెలియాల్సి ఉంది.
* ట్రూనాట్‌ మిషన్ల ద్వారా 2.28 లక్షల మందికి, వైరాలజీ ల్యాబ్‌ల ద్వారా 1.15 లక్షలు, క్లియా మిషన్ల ద్వారా 40వేలు, న్యాకో మిషన్ల ద్వారా 5వేల పరీక్షలు జరిగాయి. పూలింగ్‌ పద్ధతిలో లక్ష పరీక్షలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details