పీపీఏ సంస్థలకు హైకోర్టులో ఊరట లభించింది. పీపీఏలపై సంప్రదింపుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 63ను 4 వారాలపాటు తాత్కాలికంగా నిలిపవేయాలని హైకోర్టు ఆదేశించింది. . ఇంధనశాఖ కార్యదర్శి జారీచేసినజీవోను సవాల్ చేస్తూ విద్యుత్‌సంస్థల పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణను ఆగస్టు22కు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీవో ఆధారంగా ఏపీఎస్పీడీసీఎల్ రాసిన లేఖలనూ హైకోర్టు సస్పెండ్ చేసింది.
కాంపిటేటివ్బిడ్డింగ్‌లోనే కాంట్రాక్టులుదక్కించుకున్నామన్న వాదించిన... పీపీఏలకు ఏపీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదంతర్వాతే డిస్కంలతో ఒప్పందాలుచేశామని స్పష్టం చేశాయి. చెల్లించిన బిల్లులు సైతం మళ్లీ సమీక్షించాలని జీవో జారీ చేయడం ఏకపక్షమన్నాయి విద్యుత్ కంపెనీలు. ప్రభుత్వ తీరు పీపీఏ వ్యవవహారంలోఆక్షేపణీయమని కంపెనీల తరఫున్యాయవాది హైకోర్టులో వాదించారు.