రాష్ట్రానికి ఇవాళ 4.8 లక్షల కొవిషీల్డ్ డోసులు చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వ్యాక్సిన్ వచ్చింది. తొలుత వీటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలిస్తున్నారు. అనంతరం ఆరోగ్యశాఖ ఆదేశాలతో.. ఆయా జిల్లాలకు కొవిషీల్డ్ డోసులను పంపించనున్నారు. తాజాగా వచ్చిన డోసులతో.. రాష్ట్రంలో టీకాల కొరతకు కొంత ఉపశమనం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్రానికి చేరుకున్న మరో 4.8 లక్షల కొవిషీల్డ్ డోసులు - గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన 4.8 లక్షల కొవిషీల్డ్ డోసులు
పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి.. 4.8 లక్షల కొవిషీల్డ్ డోసులు వచ్చాయి. తాజా డోసులతో.. కొంత మేరక వ్యాక్సిన్ కొరతకు చెక్ పెట్టవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
![రాష్ట్రానికి చేరుకున్న మరో 4.8 లక్షల కొవిషీల్డ్ డోసులు covishield doses came to gannavaram airport from pune](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11762456-211-11762456-1621006536716.jpg)
రాష్ట్రానికి చేరుకున్న కొవిషీల్డ్ డోసులు