ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

COUNSELING 3rd Phase: విద్యార్థులారా ఇది మీకే.. రేపటి నుంచే మూడో విడత కౌన్సెలింగ్ - COUNSELING 3rd Phase starts from tomorrow

COUNSELING 3rd Phase: రాష్ట్రంలో గురువారం నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రారంభమౌతుందని విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి వెల్లడించారు. ఉన్నత విద్యను అభివృద్ధి చేసేందుకు.. ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను ఆయన వివరించారు.

COUNSELING 3rd Phase to students in ap
COUNSELING 3rd Phase to students in ap

By

Published : Jan 5, 2022, 5:08 PM IST

COUNSELING 3rd Phase: ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులకు రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి తెలిపారు. 2020-2021 ఉన్నత విద్యా మండలి వార్షిక నివేదికను ఆయన విజయవాడలో విడుదల చేశారు. ఈ నెలాఖరుకు మొత్తం అడ్మిషన్లు పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఇందుకోసం.. క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ద్వారా నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జాతీయ విద్యా సంస్థలతో కలిసి హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను.. 5 క్లస్టర్లుగా విభజించి ఉన్నత విద్య అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

గతేడాది 70 వేల మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగాలు పొందినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,700 కాలేజీలు వచ్చే మూడేళ్లలో ఎన్​ఏసీ (NAC) అక్రిడేషన్ తీసుకునేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. సీఎం ఆదేశాల మేరకు ఏడాది పొడవునా తనిఖీలు చేపడతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:అలాంటివారు స్వచ్ఛందంగా తప్పుకోండి.. వచ్చేవి ఆషామాషీ ఎన్నికలు కావు : చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details