ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM - Top News @ 3 PM

..

3pm top news
ప్రధాన వార్తలు @3PM

By

Published : Apr 14, 2021, 2:59 PM IST

  • సీబీఎస్​‌ఈ పరీక్షలు రద్దు
    కరోనా విజృంభణ నేపథ్యంలో సీబీఎస్​‌ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ప్రధానమంత్రితో సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎస్సీ, ఎస్టీల హక్కులను జగన్ పాలన కాలరాస్తోంది: చంద్రబాబు
    ముఖ్యమంత్రి జగన్.. తన పాలనలో ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా చిల్లకూరులో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన... రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శ్రీకృష్ణునికి 1,108 పదార్ధాలతో మహారాజభోగ నివేదన
    గుంటూరు జిల్లా నరసరావుపేట ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణునికి మహారాజభోగ నివేదన సమర్పించారు. ఇందులో భాగంగా 1,108 రకాలపదార్ధాలతో నైవేద్యం అందించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'గోవింద నామాలను అవహేళన చేస్తే సీఎం స్పందించారా..?'
    వైకాపా మత రాజకీయాలు చేస్తోందని భాజపా నేత విష్ణువర్థన్ రెడ్డి విమర్శించారు. ఉప ఎన్నిక వేళ జోవోలు తెచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వివిధ ప్రమాదాల్లో ఐదుగురు మృతి
    కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రమాదాల్లో 5 మంది మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గుంటూరులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోవటం కలకలం రేపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'భవిష్యత్‌ అవసరాలు తీర్చేలా నూతన విద్యా విధానం'
    భవిష్యత్ అవసరాలను తీర్చగలిగే సామర్థ్యం జాతీయ విద్యా విధానానికి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శత్రు దేశాలకు ఇరాన్​ పరోక్ష హెచ్చరిక!
    యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని 60 శాతానికి పెంచడం.. విధ్వంసానికి తాము ఇచ్చే సమాధానం అని ఇరాన్ అధ్యక్షుడు హసన్​ రౌహాని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ చేతులు నిండుగా ఉన్నాయని శత్రుదేశాలకు పరోక్షంగా హెచ్చరికలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు స‌రైన‌ పొదుపు ప‌థ‌కాలు ఇవే!
    వయసులో ఉన్నప్పడు కష్టపడి నాలుగు రాళ్లు వెనకేసుకుంటే అవి దీర్ఘకాలంలో మనకు ఉపయోగపడుతాయి. అలాగని పదవీ విరమణ తర్వాత అవి సరిపోతాయని చెప్పలేం. అందుకే పదవీ విరమణ తర్వాత కూడా పొదుపు చాలా ముఖ్యం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • షారుక్​ క్షమాపణలు.. బదులిచ్చిన రస్సెల్​
    ముంబయితో మ్యాచ్​లో కోల్​కతా జట్టు ప్రదర్శనపై స్పందించారు ఆ జట్టు సహ యజమాని షారుక్​ ఖాన్. అభిమానులకు ట్విట్టర్​ వేదికగా క్షమాపణలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'జాతిరత్నాలు' దర్శకుడితో హీరో రామ్ చిత్రం!
    'జాతిరత్నాలు' సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు కేవీ అనుదీప్​కు టాలీవుడ్​లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. యువ కథానాయకుడు రామ్​ హీరోగా అనుదీప్​ ఓ సినిమా తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details