కరోనా రోజురోజుకు మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల్లో 3,309 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా..అనంతపురం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 1,053 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 18,666 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 31,929 మందికి కరోనా పరీక్షలు చేశారు.
రాష్ట్రంలో మళ్లీ 3 వేలు దాటిన కరోనా కేసులు.. 12 మంది మృతి - భారతదేశంలో కరోనా వైరస్
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 3,309 కరోనా కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి.
![రాష్ట్రంలో మళ్లీ 3 వేలు దాటిన కరోనా కేసులు.. 12 మంది మృతి new corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11356399-819-11356399-1618060963655.jpg)
new corona cases