ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాకాసి అలలతో మెరీనా బీచ్‌లో విద్యార్థి మృతి... మరో ఇద్దరి గల్లంతు - AP Latest news

రాకాసి అలలతో మెరీనా బీచ్‌లో విద్యార్థి మృతి... మరో ఇద్దరి గల్లంతు
రాకాసి అలలతో మెరీనా బీచ్‌లో విద్యార్థి మృతి... మరో ఇద్దరి గల్లంతు

By

Published : Feb 11, 2021, 10:01 PM IST

Updated : Feb 12, 2021, 1:32 AM IST

22:00 February 11

చెన్నై మెరీనా బీచ్‌లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్రంలోకి దిగిన శివబాలాజీ, గోపీశాంత్‌, ఆకాశ్‌ గల్లంతయ్యారు. వీరిలో శివబాలాజీ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు బయటకు తీశారు.

తమిళనాడులోని చెన్నై మెరీనా సముద్ర తీరంలో నీట మునిగి ఓ యువకుడు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి రాకాసి అలల ధాటికి కన్నుమూశాడు. మిగిలిన ఇద్దరు కృష్ణా జిల్లాకు చెందిన వారు. కృష్ణాజిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామానికి చెందిన సూరా గోపిచంద్‌(18) ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేశాడని పోలీసులు పేర్కొన్నారు.

రెండు రోజుల కిందటే..

చెన్నైలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రవేశం పొందడానికి గంపలగూడెం మండలం దుందిరాలపాడు శివారు మల్లెంపాడుకు చెందిన వాకదాని ఆకాశ్‌(18)తో పాటు గుంటూరు గ్రామీణ మండలం పొత్తూరుకు చెందిన శివబాలాజీ (19) తో కలిసి రెండు రోజుల కిందట చెన్నై వెళ్లారు.

ముమ్మర గాలింపు..

స్థానికంగా ఉన్న మరో ఇద్దరు మిత్రులు రాజశేఖర్‌, శివ ప్రశాంత్‌తో కలిసి గురువారం మెరీనా తీరానికి వెళ్లారు. ఈ క్రమంలో రాజశేఖర్‌, శివప్రశాంత్‌ ఒడ్డున ఉండగా... మిగిలిన ముగ్గురూ సముద్రంలోకి దిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న చెన్నై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి శివబాలాజీ మృతదేహాన్ని వెలికితీశారు. మిగతా వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి:

మున్సిపల్ కమిషనర్​పై దాడికి వ్యాపారుల యత్నం

Last Updated : Feb 12, 2021, 1:32 AM IST

ABOUT THE AUTHOR

...view details