ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Covishield: రాష్ట్రానికి మరో 3.72 లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు - corona updates in ap

రాష్ట్రానికి మరో 3.72 లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు వచ్చాయి. గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి టీకా డోసులు తరలించారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో వ్యాక్సిన్లు జిల్లాలకు తరలివెళ్లనున్నాయి.

covid vaccine doses reached to andhra pradesh
covid vaccine doses reached to andhra pradesh

By

Published : Jul 24, 2021, 11:53 AM IST

రాష్ట్రానికి మరో 3.72 లక్షల కొవిడ్ టీకా డోసులు వచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. దిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 31 బాక్సుల్లో టీకా డోసులు రాష్ట్రానికి తరలివచ్చాయి.

తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు వ్యాక్సిన్​ను తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో వ్యాక్సిన్ డోసులు జిల్లాలకు తరలివెళ్లనున్నాయి. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం కలిగింది.

ABOUT THE AUTHOR

...view details