ఏసీపీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయించాలని డీజీపీని కోరాం. శవపరీక్ష నివేదిక వచ్చాక మరింత సమాచారం వస్తుంది. ఇప్పటికే ప్రైవేట్ హోమ్‌లపై దృష్టిపెట్టాం. ప్రైవేట్ హోమ్‌లను అంగన్వాడీ టీచర్లు పరిశీలించాలని సూచించాం. ప్రైవేట్ హోమ్‌లపై పర్యవేక్షణ పెంచాం. 429 ప్రైవేట్ హోమ్‌లలో 14 వేల మంది పిల్లలున్నారు. భవిష్యత్తులో ఇలాటి ఘటనలు జరగకుండా చూస్తాం - దివ్య దేవరాజన్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ కమిషనర్.
అమీన్‌పూర్ ఘటన: లైంగికదాడిపై మూడు కేసులు నమోదు. - అమీన్‌పూర్ అనాథాశ్రమ ఘటన
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ఘటనలో 3 కేసులు నమోదు చేసినట్లు మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ తెలిపారు. మారుతి హోమ్ రిజిస్ట్రేషన్ రద్దు చేశామని.. అందులో ఉన్న 49 మంది పిల్లలను ప్రభుత్వ హోమ్‌లో చేర్పించామని స్పష్టం చేశారు. ఘటనపై ఏర్పాటైన హైపవర్ కమిటీ విచారణ చేస్తోందన్నారు. ఈనెల 20లోపు నివేదిక ఇవ్వాలని సూచించామని వివరించారు.

3-cases-registered-on-ameenpura-minor-girl-issue
ఇదీ చూడండి