ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటితో ముగియనున్న తొలివిడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ - ap local polls 2021 news

రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ.... రెండో రోజు ఊపందుకుంది. కులధ్రువీకరణ పత్రాల సమర్పణలో వెసులుబాటు కల్పించడం వల్ల భారీగా నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పలు ప్రాంతాల్లో ఘర్షణల వల్ల నామినేషన్ల ప్రక్రియ వాడీవేడిగా సాగింది. నామపత్రాల దాఖలుకు ఇవాళే ఆఖరి రోజు కావటంతో భారీగా దాఖలయ్యే అవకాశముంది.

ఏపీ పంచాయతీ ఎన్నికలు
ap local polls 2021

By

Published : Jan 30, 2021, 11:33 PM IST

Updated : Jan 31, 2021, 4:00 AM IST

రెండోరోజు 7,460 సర్పంచి, 23,318 వార్డులకు నామినేషన్ల దాఖలు

తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజైన శనివారం భారీ సంఖ్యలో నామపత్రాలు దాఖలయ్యాయి. రెండోరోజు రాష్ట్రవ్యాప్తంగా సర్పంచి స్థానాలకు 7 వేల 460, వార్డు స్థానాలకు 23 వేల 318 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రెండు రోజులకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా.... సర్పంచి పదవికి 8 వేల 773, వార్డు సభ్యులకు 25 వేల 519 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. విజయనగరం మినహా మిగతా 12 జిల్లాల్లో నామినేషన్లు కొనసాగుతుండగా..... పలుచోట్ల ఘర్షణల వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

గుంటూరు జిల్లాలో రెండో రోజు..... సర్పంచి స్థానాలకు 567 మంది నామినేషన్లు వేయగా..... ఇప్పటిదాకా దాఖలైన నామపత్రాల సంఖ్య 696కు చేరింది. వార్డు సభ్యులుగా 2 వేల 313 మంది నామినేషన్లు దాఖలు చేయగా..... మొత్తం మీద 2 వేల 531 నామినేషన్లు దాఖలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో రెండో రోజు సర్పంచ్ స్థానానికి 854 మంది నామినేషన్లు వేయగా..... మొత్తం సంఖ్య 11 వందల 2కు చేరింది. వార్డు స్థానాలకు రెండో రోజున 4 వేల 678 నామినేషన్లు దాఖలవ్వగా..... ఇప్పటివరకూ పోటీకి దిగిన వారి సంఖ్య 5 వేల 326కు పెరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.

Last Updated : Jan 31, 2021, 4:00 AM IST

ABOUT THE AUTHOR

...view details