ఆన్లైన్లో నిర్వహిస్తున్న 28వ రాష్ట్రస్థాయి విజ్ఞాన సదస్సు పోటీలు ముగిశాయి. ఇటువంటి సదస్సులు చిన్నారుల మేథస్సును పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. సదస్సు ముగింపులో ఆయన పాల్గొన్నారు. 13 జిల్లాల నుంచి మొత్తం 130 ప్రాజెక్టులు రాగా.. వీటిలో 15 ప్రాజెక్టులు జాతీయస్థాయికి ఎంపికయ్యాయి. కృష్ణా జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో ఎంపికయ్యాయని పీవో ఢిల్లీశ్వరరావు తెలిపారు.
గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులను ప్రదానం చేశారు. కొవిడ్ కారణంగా రెండు రోజుల పాటు ఆన్లైన్లో పోటీలు నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటి వద్ద దొరికే మూలికలతో శానిటైజర్ తయారు చేశారు. మరో విద్యార్ధిని రొయ్యల వ్యర్థాల నుంచి బయో డీగ్రేడ్ ప్లాస్టిక్‌ను తయారు చేశారు. ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కో అంశంపై పరిశోధన చేసి అద్భుత ప్రతిభ కనబరిచారని ప్రాజెక్ట్ డైరక్టర్ తెలిపారు.