ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Legal Notice to CRDA: హ్యాపీనెస్ట్ జాప్యంపై సీఆర్డీఏకు లీగల్ నోటీసులు - ap latest news

Legal Notice to CRDA
హ్యాపీనెస్ట్ జాప్యంపై సీఆర్డీఏకు లీగల్ నోటీసులు

By

Published : Feb 23, 2022, 1:40 PM IST

Updated : Feb 23, 2022, 2:29 PM IST

13:37 February 23

నష్టపరిహారం కింద రూ.20 లక్షలు ఇవ్వాలని నోటీసుల్లో వెల్లడి

Legal Notice to CRDA: హ్యాపీనెస్ట్ నిర్మాణంలో జాప్యంపై.. సీఆర్డీఏకు 28 మంది లీగల్ నోటీసులు పంపించారు. 2021 డిసెంబర్ 31 నాటికి ప్లాట్లు అందజేయాలని ఒప్పందం జరిగిందని.. గడువు తీరినప్పటికీ ఫ్లాట్లు అప్పగించకపోవటంతో.. చెల్లించిన 10శాతం సొమ్మును 14శాతం వడ్డీతో సహా చెల్లించాలని నోటీసుల్లో కోరారు. అలాగే 20 లక్షల పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. లేదంటే రెరా సీఆర్డీఏపై చట్టం కింద కేసు వేస్తామంటుని హ్యాపీనెస్ట్ కొనుగోలుదారులు స్పష్టం చేశారు. ఈ మేరకు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ ద్వారా.. సీఆర్డీఏ అధికారులకు నోటీసులు పంపించారు.

2018లో సీఆర్డీఏ ద్వారా హ్యాపీనెస్ట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నిర్మించే 12 టవర్లలో 1200 ఫ్లాట్లు కడుతున్నట్లు పేర్కొంది. ఈ ప్రకటనతో హ్యాపీనెస్ట్ ఫ్లాట్లన్నీ గంటలోనే అమ్ముడయ్యాయి. సీఆర్డీఏ ఒప్పందం మేరకు తొలి వాయిదాగా కొనుగోలుదారులు 10 శాతం సొమ్ము చెల్లించారు.

ఇదీ చదవండి:

ఒక పోస్టు కోసం భర్తీ చేసుకుని... మరో పోస్టులో ఎలా నియమిస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

Last Updated : Feb 23, 2022, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details