ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS JOBS: గుడ్​న్యూస్​.. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి - తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల వార్తలు

TS JOBS: తెలంగాణ ప్రభుత్వం మరో 2,440 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్​ శాఖల్లో​ ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్మీడియెట్ కమిషనర్ పరిధిలో 1,523 పోస్టులున్నాయి. ఇందులో 1,392 మంది జూనియర్ లెక్చరర్ పోస్టులు కాగా.. 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చారు.

TS JOBS
TS JOBS

By

Published : Jul 22, 2022, 8:05 PM IST

TS JOBS: తెలంగాణ ప్రభుత్వం మరో 2,440 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్​ శాఖల్లో​ ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్మీడియెట్ కమిషనర్ పరిధిలో 1,523 పోస్టులున్నాయి. ఇందులో 1,392 మంది జూనియర్ లెక్చరర్ పోస్టులు కాగా.. 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చారు. ఆర్కైవ్స్ విభాగంలో 14 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పరిధిలో 359 పోస్టులున్నాయి. అందులో 247 లెక్చరర్ పోస్టులతో పాటు 14 ఇన్​స్ట్రక్టర్, 31 లైబ్రేరియన్, 5 మాట్రన్, 25 ఎలక్ట్రీషియన్, 37 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

కళాశాల విద్యా విభాగంలో 544 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో 491 లెక్చరర్ పోస్టులు, 24 లైబ్రేరియన్, 29 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మరో 2,440 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందన్న మంత్రి హరీశ్​రావు.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇప్పటి వరకు 49,428 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details