రాష్ట్రంలో కొత్తగా 2432 కరోనా కేసులు.. 44 మంది మృతి - కరోనా లక్షణాలు
![రాష్ట్రంలో కొత్తగా 2432 కరోనా కేసులు.. 44 మంది మృతి 2432 new corona cases registered in andhrapradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8035713-232-8035713-1594810593745.jpg)
15:45 July 15
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. కొత్తగా 2,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 44 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కరోనా రోజురోజుకు పంజా విసురుతోంది. కొత్తగా 2432 కేసులు నమోదవ్వగా.. మెుత్తం కేసుల సంఖ్య 35,451కి చేరింది. మరో 44 మంది మృతి చెందగా.. మెుత్తం మృతుల సంఖ్య 452కి కరోనా మరణాలు చేరుకున్నాయి.
అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందగా.. కర్నూలు జిల్లాలో మరో ఐదుగురు మృతి చెందారు. చిత్తూరు, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం 16,621 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 18,378 కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జి అయ్యారు. 24 గంటల వ్యవధిలో 22 వేల 197 నమూనాలు పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 12.18 లక్షల మందికి కరోనా పరీక్షలు జరిగాయి.