AP Corona Cases: కొత్తగా 2174 కరోనా కేసులు.. 18మరణాలు - ఏపీ కరోనా కేసులు తాజా వార్తలు
17:12 July 24
today AP Corona Cases
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 74,820పరీక్షలు నిర్వహించగా.. 2,174 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 19,52,513 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,241కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,412 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,16,914కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,358 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు.
ఇదీ చదవండి:
Covishield: రాష్ట్రానికి మరో 3.72 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు