ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గణతంత్ర దినోత్సవ వేదిక విజయవాడకు మార్పు - విశాఖలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే రాష్ట్ర గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ముందుగా వేడుకలను విశాఖలో నిర్వహించాలని ప్రభుత్వం అనుకున్నా అనూహ్యంగా వేదికను మార్చింది.

గణతంత్ర దినోత్సవ వేడుకల వేదిక మార్పు
గణతంత్ర దినోత్సవ వేడుకల వేదిక మార్పు

By

Published : Jan 21, 2020, 5:20 PM IST

గణతంత్ర దినోత్సవ వేదిక విజయవాడకు మార్పు

గణతంత్ర దినోత్సవ వేదికను విశాఖ నుంచి విజయవాడకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా వేడుకలను విశాఖలో నిర్వహించాలని భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. బీచ్‌రోడ్డులో ఏర్పాట్లు దాదాపు పూర్తైయ్యాయి. అయితే ప్రభుత్వం వేదికను ఉన్నట్టుండి విశాఖ నుంచి విజయవాడకు మార్చింది. ఈ మేరకు విశాఖ, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు, సాధారణ పరిపాలనశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ ఆదేశాలతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియాన్ని నగరపాలక సంస్థ కమిషనర్‌తో కలసి సంయుక్త కలెక్టర్‌ మాధవీలత పరిశీలించారు. ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమాచారాన్ని సీఎం కార్యాలయం అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి వేదిక మార్పు విషయాన్ని గవర్నర్​ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details