తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 202 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్ బారినపడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,91,118 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఇప్పటివరకు 1,574 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 253 మంది బాధితులు కోలుకున్నారు.
ఇప్పటివరకు 2,85,102 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,442 కరోనా యాక్టివ్ కేసులుండగా.. ప్రస్తుతం 2,541 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 48 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తెలింది.