ఆల్ ది బెస్ట్ ఇండియా.... గళమెత్తిన విజయవాడ - wordl cup 2019
ప్రపంచ కప్ సమరంలో .. హై ఓల్టేజిని పెంచేసే దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో చిరకాల శత్రువులుగా పేరు తెచ్చుకున్న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మరి కొద్దీ సేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రస్తుత టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్‌కు ఓటమి లేకపోగా, పాక్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు ఓడింది.
భారత్-పాక్ మధ్య సంబంధాలు క్షీణించడంతో పాటు పుల్వామా ఉగ్రదాడి తర్వాత వరల్డ్ క్‌పలో అసలు పాక్‌తో మ్యాచ్ ఆడొద్దనే డిమాండ్ గట్టిగానే వినిపించింది. అలా జరిగితే మనం రెండు పాయింట్లు కోల్పోయినట్టేనని.. దానికి బదులు మైదానంలో దిగి పాక్‌ను ఓడిస్తేనే మజా అంటూ మరోవైపు నుంచి వాదన వచ్చింది. ఇలాంటి ఉత్కంఠ స్థితిలో జరుగుతున్న మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ భారత్ .. భారత్ గెలుపును కాంక్షిస్తున్నారు. ఆరు నూరైనా దాయాదుల పోరులో విజయం భారత్‌తే అంటున్నారు విజయవాడలోని క్రికెట్ అభిమానులు.