తెలంగాణలోని గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై బస్సు కంటైనర్ను ఢీకొన్న ఘటనలో 20మంది గాయపడ్డారు. వేములవాడ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు వేములవాడ నుంచి సిరిసిల్ల సిద్ధిపేట మీదుగా హైదరాబాద్కు వస్తున్న సమయంలో ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది.
ROAD ACCIDENT: కంటైనర్ లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 20మందికి గాాయాలు - రోడ్డు ప్రమాదంలో 20మందికి గాాయాలు
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కంటైనర్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కంటైనర్ లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
జగదేవపూర్ క్రాసింగ్ వద్ద కంటైనర్ వాహనం రాజీవ్ రహదారి నుంచి జగదేవపూర్ వైపు మలుపుతున్న సమయంలో సిద్దిపేట వైపు నుంచి వచ్చిన లగ్జరీ బస్సు కంటైనర్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల క్యాబిన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలవ్వగా.. క్షతగాత్రులను 108 వాహనంలో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు.
ఇదీ చదవండి: