ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో 13కు చేరిన కరోనా పాజిటివ్​ కేసులు

రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖకు చెందిన కరోనా బాధితుడి బంధువుకు వైరస్‌ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో స్పష్టం చేసింది. గుంటూరుకు చెందిన మరో రోగి బంధువుకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు వెల్లడించింది. మొత్తంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు పెరిగింది. మరో 25 మంది అనుమానితులకు సంబంధించిన నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.

2 more corona cases in andhrapradesh
2 more corona cases in andhrapradesh

By

Published : Mar 27, 2020, 9:31 PM IST

Updated : Mar 28, 2020, 5:25 AM IST

రాష్ట్రంలో 13కు చేరిన కరోనా పాజిటివ్​ కేసులు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రెండు కరోనా పాజిటివ్‌ కేసుల నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈనెల 19న దిల్లీ నుంచి వచ్చి కరోనా పాజిటివ్​గా తేలిన వ్యక్తి భార్యకూ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన అధికారిక బులిటెన్​లో ప్రకటించింది. అతనితో పాటు దిల్లీ వెళ్లి వచ్చిన 12 మంది నివేదిక కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో జిల్లాలో శుక్రవారం మరో 6 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఐసోలేటెడ్ వార్డులలో 16 మంది చికిత్స పొందుతున్నారు. 14 మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలో కేసులు 2కు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

విశాఖలో 4 పాజిటివ్​ కేసులు

విశాఖలో మరోకరికి కరోనా వైరస్‌ సోకింది. కొత్తగా కరోనా సోకిన కేసుతో కలిపి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 4కు పెరిగింది. కరోనా వచ్చిన వ్యక్తి బంధువుకే వైరస్‌ సోకినట్లు తేల్చారు. అందుకే విదేశాల నుంచి వచ్చిన వారిపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది.

కడపకు విదేశాల నుంచి..

కడప జిల్లాలో కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో 31 మంది నమూనాలను వైద్యులు సేకరించారు. వీరిలో 22 మందికి నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. 9 మంది నివేదిక ఇంకా రావాల్సి ఉందని వెల్లడించారు. పశ్చిమగోదావరిజిల్లాలో కొత్తగా రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యయి. ఇప్పటికే 11మంది అనుమానిత వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా అన్నీ నెగిటివ్ గా నిర్ధారించారు. జిల్లాకు 4 వేల 146మంది విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

కరోనా కేసులు పెరుగుతున్నందున విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు వారి సన్నిహితులు గురించి ఆరా తీస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా అనుమానితులకు సంబంధించి న్యూ కాంటాక్ట్ ట్రెసింగ్ కు నిబంధనలు విడుదల చేసినట్టు స్పష్టం చేసింది. విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కళాశాల, కాకినాడలోని రంగారాయ మెడికల్ కళాశాలలు కోవిడ్-19 చికిత్సా కేంద్రాలుగా ఐసీ ఎమ్మార్ గుర్తించిందని తెలిపింది.

ఇదీ చదవండి: దేశంలో మరో 75 మందికి కరోనా- 17 మంది మృతి

Last Updated : Mar 28, 2020, 5:25 AM IST

ABOUT THE AUTHOR

...view details