బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ అమలులో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో విడివిడిగా కమిటీలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులిచ్చారు. నవరత్నాలు, నాడు- నేడు కింద సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు,మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం భూములు విక్రయం ద్వారా నిధులు సమీకరణకు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్‌తో అధికారులు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ప్రకారం జిల్లాల వారీగా ఎంపిక చేసిన భూములను విక్రయిస్తారు.ఈ క్రమంలో సీఎం ఛైర్మన్‌గా రాష్ట్రస్థాయి కమిటీని,కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు ఉత్తర్వుల్లో ఉషారాణి పేర్కొన్నారు.
'బిల్డ్ ఏపీ' కోసం రెండు కమిటీలు - latest news of build andrapradesh mission
బిల్డ్ ఆంధ్రప్రదేశ్‌కు రెండు నూతన కమిటీలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బిల్డ్ ఏపీ కోసం రెండు కమిటీలు