రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 45,533 మంది నమూనాలు పరీక్షించగా 1,190 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 11 మంది మృతి చెందారు. కరోనా నుంచి తాజాగా 1,226 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 20,00,877 మందికి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 15,110 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ కారణంగా.. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 1,190 కరోనా కేసులు.. 11 మరణాలు - ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు వార్తలు
రాష్ట్రంలో కొత్తగా 1,190 కరోనా కేసులు, 11 మరణాలు
16:17 September 12
రాష్ట్రంలో ప్రస్తుతం 15,110 కరోనా యాక్టివ్ కేసులు
రాష్ట్రవ్యాప్తంగా మెగా డ్రైవ్‌లో భాగంగా శని, ఆదివారాల్లో 23.59 లక్షల మందికి కొవిడ్ టీకాలు ఇచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ భాస్కర్ కాటమనేని వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు ఒక్క డోసు తీసుకున్నవారి సంఖ్య 2.5 కోట్లకు చేరిందన్నారు. రెండు డోసులు పూర్తయినవారి సంఖ్య కోటికి చేరిందని తెలిపారు.
Last Updated : Sep 13, 2021, 4:29 AM IST