ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Current Polls In Farming land: ఎకరం పొలంలో ఏకంగా 19 కరెంట్​ పోల్స్​.. ఈ స్తంభాలాటేందో..? - farmers problems with current poles

Current Polls In Farming land: అధికారుల నిర్లక్ష్యం ఆ రైతు పాలిట శాపమైంది. విద్యుత్​ ఉప కేంద్రం పక్కనే తన పొలం ఉండటమే పాపమైపోయింది. ఉన్న కాస్త పొలంలో ఏకంగా 19 విద్యుత్​ స్తంభాలు ఏర్పాటు చేసి అధికారులు ఆ రైతును కష్టాల పాలు చేస్తున్నారు. ఒకే ఎకరంలో ఇన్ని స్తంభాలు పాతారంటేనే.. అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో కళ్లకు కడుతోంది.

Current Polls In Farming land
ఎకరం పొలంలో ఏకంగా 19 కరెంట్​ పోల్స్

By

Published : Jan 22, 2022, 7:45 PM IST

Current Polls In Farming land: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన బెల్లంకొండ మల్లారెడ్డికి ఎకరం పొలం ఉంది. ఆ పొలం పక్కనే విద్యుత్ ఉపకేంద్రం ఉంది. మూడేళ్ల కిందట మల్లారెడ్డి పొలంలో అధికారులు ఏకంగా 19 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. అసలే చిన్నకారు రైతు. అధికారులతో పోరు పెట్టుకున్నా.. పట్టించుకున్న నాథుడే లేదు. ఇదిలా ఉండగా.. మల్లారెడ్డి కొంతకాలం కిందట మృతిచెందాడు. మల్లారెడ్డి తర్వాత ఆ పొలంలో ఆయన కుమారుడు రాఘవరెడ్డి వ్యవసాయం చేసుకుంటున్నాడు.

ఉన్న ఎకరంలో రాఘవరెడ్డి వరి సాగు చేస్తున్నాడు. పొలంలో ట్రాక్టర్​లో దున్నాలంటే డ్రైవర్లు జంకుతున్నారు. దున్నినప్పుడల్లా ట్రాక్టర్లకు స్తంభాలు తగలటం వల్ల.. భయం భయంగానే సాగు చేయాల్సి వస్తోంది. కూలీలు కూడా పనికి రావాలంటే భయపడుతున్నారు. పనులు చేసేటప్పుడు కరెంట్​షాక్​ లాంటిదేమైనా ప్రమాదం సంభవిస్తే.. ఎవరు బాధ్యులని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ పొలంలోకి వచ్చేందుకు, సాగు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపట్లేదు.

ఇటీవలే రాఘవరెడ్డి విద్యుత్​ అధికారులను కలిశాడు. స్తంభాలు తొలగించాలని అధికారులను కోరినా.. ఎలాంటి ఉపయోగం లేకపోయింది. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి తన పొలంలో ఉన్న స్తంభాలను తొలగించాలని రాఘవరెడ్డి కోరుతున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details