కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70కి పెరిగింది. గత 24 గంటల్లో 18 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 2 మినహా మిగిలిన అన్నీ విజయవాడ నగర పరిధిలోనివే. విద్యాధరపురం, గుప్తా సెంటర్, ఖుద్దూస్ నగర్, కానూరు, సనత్‌నగర్, చోడవరం, కొత్తపేట, ఈడ్పుగల్లు, మాచవరం, గిరిపురం ప్రాంతాలకు చెందిన వారిలో పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. జగ్గయ్యపేట, నూజివీడులలోనూ కొత్త కేసులు నమోదు అయ్యాయి. పాజిటివ్ వచ్చిన వారిలో కొందరు మార్చి 18న దిల్లీ నుంచి జిల్లాకు వచ్చిన వారు కాగా... మరికొందరికి వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఇప్పటికే కొందరిని గన్నవరం, గంగూరు సహా ఇతర క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు.
జిల్లాలో కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు - coronavirus death toll in andhrapradesh
గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 70కి చేరింది.
18-new-more-corona-cases-conformed-in-krishna-district