AP Corona Cases: కొత్తగా 1,608 కరోనా కేసులు.. 6 మరణాలు - ఏపీలో కొత్తగా 1,608 కరోనా కేసులు
16:53 September 10
VJA_Corona bulletin_Breaking
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,608 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,24,755 మంది వైరస్ బారినపడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,970కి చేరింది. తాజాగా మరో 1,107 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,95,666కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,119 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,72,29,781 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
ఇదీ చదవండి:
Departmental Exams: సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు.. నోటిఫికేషన్ జారీ