తెదేపా మహానాడుకు 16 కమిటీలు.. ఏర్పాటు చేసిన అధినేత చంద్రబాబు - 16 committees for Telugu Desam Mahanadu
Committees for Telugu Desam Mahanadu: ఒంగోలులో ఈనెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం మహానాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నేతృత్వంలో మహానాడు నిర్వహణ, సమన్వయ కమిటీలను అధినేత చంద్రబాబు ప్రకటించారు.
Mahanadu
తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు 16 కమిటీలను అధినేత చంద్రబాబు ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నేతృత్వంలో మహానాడు నిర్వహణ, సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో తెలుగుదేశం మహానాడు నిర్వహించనున్నారు.
- ఆహ్వాన కమిటీ : అచ్చెన్నాయుడు, బక్కని నరసింహులు
- తీర్మానాల కమిటీ : యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కాలవ శ్రీనివాసులు, షరీఫ్, నక్కా ఆనంద్‌బాబు, రామానాయుడు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి
- వసతి ఏర్పాట్ల కమిటీ : రవిచంద్ర యాదవ్, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు
- సభా నిర్వహణ కమిటీ : పయ్యావుల కేశవ్, రామ్మోహన్‌నాయుడు, ధూళిపాళ్లనరేంద్ర, వర్ల రామయ్య కొల్లు రవీంద్ర