ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏపీ రెవెన్యూ లోటు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు సంబంధించినది'

ఏపీ రెవెన్యూ లోటు వివరాలు తనకు తెలీవని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. 14వ ఆర్థిక సంఘం గడువు తీరిపోయి.., పదిహేనో ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు సైతం ప్రారంభమైందన్నారు. వ్యవసాయ చట్టంలో తాము చేసిన మార్పులు రైతుల ఆదాయాన్ని పెంచుతాయని భరోసా ఇచ్చారు. కొవిడ్‌ సంక్షోభం నుంచి దేశం పూర్తిగా కోలుకున్నట్లేనన్నారు.

14వ ఆర్థిక సంఘం...ముగిసిన  అధ్యాయం
14వ ఆర్థిక సంఘం...ముగిసిన అధ్యాయం

By

Published : Oct 8, 2020, 4:41 AM IST

ఏపీ డిమాండ్ చేస్తున్న పెండింగ్ రెవెన్యూ లోటు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు సంబంధించినదని, ఆ ఆర్థిక సంఘం గడువు తీరిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఇచ్చి ఏడాది గడిచిపోయిందని, అమలు కూడా ప్రారంభమైందన్నారు. అప్పట్ల్లో మా మంత్రిత్వ శాఖ దీన్ని చర్చించిందని..,వారు ఏ పరిష్కారం చెప్పారో తనకు తెలియదన్నారు. ఆ రెవెన్యూ లోటు మొత్తం ఎంతో కూడా తనకు తెలియదని చెప్పారు. పెండింగ్ అంశాలపై ప్రశ్నించే రాష్ట్రాల హక్కును తాను కాదనడం లేదని, అయితే... వాటిని ఎలా పరిష్కరించాలో చర్చించి నిర్ణయించాల్సి ఉందన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆమె రెవెన్యూ లోటు, ఇతర అపరిష్కృత అంశాలపై విజయవాడలో ప్రస్తావించగా ఈ విధంగా స్పందించారు.

వ్యవసాయ చట్టాలతో మేలే...

వ్యవసాయ చట్టాల్లో కేంద్రం తీసుకొచ్చిన సవరణలతో మధ్యవర్తులకు మాత్రమే నష్టమని ఈ అంశంపై విజయవాడలో భాజపా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని రైతుల ఆదాయాన్ని 2023 నాటికి రెట్టింపు చేయాలన్న ప్రధాని మోదీ సంకల్పంలో భాగంగానే... 3 చట్టాలు సవరించామని పేర్కొన్నారు. ఏడాది కాలం పాటు అందరు భాగస్వాములతో చర్చించిన తర్వాతే ఈ చర్యలు చేపట్టామన్నారు. తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ఈ విషయాన్ని పొందుపరిచామని గుర్తు చేశారు. చిన్న రైతుల రక్షణ కోసం పది వేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతులు తమ పంటను అక్కడే నిల్వ ఉంచుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు. ప్రతిపక్షాలు అపోహలు, అనుమానాలు సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని కోరారు.

కొవిడ్‌ సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుందని ఆర్థికమంత్రి చెప్పారు. అన్ని సూచీలూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయని, రాష్ట్రాల నుంచీ సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. రోజూ తాను పరిశ్రమ పెద్దలతో మాట్లాడుతున్నానన్న మంత్రి...మునుపటి సామర్థ్యం మేరకు వ్యవస్థ కోలుకున్నట్లే అని చెప్పారు.

'అమరావతిపై సానుకూలంగా స్పందిచారు'

రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్​ను అమరావతి మాహిళా జేఎసీ నేతలు కలిశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించేదుంకు చర్యలు తీసుకోవాలని ఆమెకు వినతిపత్రం అందించారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించినట్లు మాహిళాజేఎసీ నేతలు సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు.

ఇదీచదవండి

'కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం ఉండదు'

ABOUT THE AUTHOR

...view details