పదో తరగతి పరీక్షలు మేలో!
పదో తరగతి పరీక్షలు మే నెల చివరి వారంలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ కొనసాగనున్నందున ఆ తర్వాత పరిస్థితి ఆధారంగా మే నెల చివరిలో పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తే ఈ షెడ్యూల్‌ను అమలు చేయనున్నారు. పదో తరగతి పరీక్షల ఆధారంగానే పాలిసెట్, ఇంటర్ ప్రవేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 14 వరకు సెలవుల పొడిగింపు
రాష్ట్రంలో అన్ని పాఠశాలలు, బీఈడీ, డీఈడీ కళాశాలలకు ఏప్రిల్ 14వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో గతంలో ఈనెల 31 వరకు సెలవులు ఇవ్వగా.. దీన్ని ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.