రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 1,056 కరోనా కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 8,54,011కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 6,868 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8.28 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా... ప్రస్తుతం 18,659 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో 53,215 కరోనా పరీక్షలు నిర్వహించగా... రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం వైరస్ నిర్ధరణ పరీక్షల సంఖ్య 91.54 లక్షలకు చేరింది.
జిల్లాల వారీగా కరోనా మృతులు...
అనంతపురం, చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కడప, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.