ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'1048 మంది ఆంధ్ర ఆసుపత్రి సిబ్బందికి వ్యాక్సినేషన్'

విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో టీకా పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ఇంతియాజ్ బుధవారం ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుప్రతి ఆధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ పి.వి.రామారావు ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

andhra hospital vijayawada
andhra hospital vijayawada

By

Published : Jan 20, 2021, 4:34 PM IST

రాష్ట్రంలో మొదటిసారిగా ప్రైవేట్ ఆసుప్రతి ఆధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటుకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అనుమతినిచ్చారు. విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీకా పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. 1048 మంది ఆంధ్ర ఆసుపత్రి సిబ్బందికి రెండు రోజుల పాటు టీకాలు పంపిణీ చేస్తారని తెలిపారు. దీనికోసం మొత్తం ఐదు వ్యాక్సినేషన్ బూత్​లను ఏర్పాటు చేశారని ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ పి.వి.రామారావు తెలిపారు. వ్యాక్సినేషన్ కేంద్రంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్న డాక్టర్ రామారావుతో మా ప్రతినిధి ముఖాముఖి...

ఆంధ్ర ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ పి.వి.రామారావుతో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details