ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమ‌ల‌లో యుద్ధ‌కాండ పారాయ‌ణానికి అంకురార్పణ - tirumala programs updates

తిరుమ‌ల‌లో ''యుద్ధ‌కాండ పారాయ‌ణ'' కార్య‌క్ర‌మానికి అంకురార్ప‌ణ నిర్వహించారు. లోక కళ్యాణార్థం వ‌సంత మండ‌పంలో శనివారం నుంచి యుద్ద‌కాండ పారాయ‌ణం నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశారు.

yudhakanda prayanam at tirumala
తిరుమ‌ల‌లో యుద్ధ‌కాండ పారాయ‌ణానికి అంకురార్పణ..

By

Published : Jun 11, 2021, 8:36 AM IST

తిరుమ‌ల‌లో ''యుద్ధ‌కాండ పారాయ‌ణ'' కార్య‌క్ర‌మానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వహించారు. లోక కళ్యాణార్థం వ‌సంత మండ‌పంలో శనివారం నుంచి యుద్ద‌కాండ పారాయ‌ణం నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం ప్రార్థ‌న మందిరంలో శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది.

ఇందులో భాగంగా సంక‌ల్పం, గ‌ణ‌ప‌తి పూజ‌, పుణ్యాహ‌వ‌చ‌‌నం, రుత్విక్‌వ‌ర‌ణం, కంక‌ణ ధార‌ణ‌, అగ్నిప్ర‌తిష్ట‌, అంకురార్పణ నిర్వ‌హించారు. వేద పాఠశాల ప్రిన్సిపాల్ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని ఆధ్వ‌ర్యంలో శనివారం నుంచి పారాయ‌ణంలో 32 మంది పండితులు పాల్గొననున్నారు. ఇందులో 16 మంది వేద పండితులు ధ‌‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలో జపం, హోమం నిర్వ‌హిస్తారు. వ‌సంత మండ‌పంలో 16 మంది పండితులు యుద్ధ‌కాండ‌లోని శ్లోకాల‌ను పారాయ‌ణం చేయ‌నున్నారు.

ABOUT THE AUTHOR

...view details