ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PEDDIREDDY ON FLOODS: వారందరికీ పరిహారం ఇస్తాం : పెద్దిరెడ్డి - చిత్తూరు జిల్లా వరదల తాజా వార్తలు

వరదల నష్టం, సహాయక చర్యలపై వైకాపా మంత్రులు తిరుపతిలో(MINISTERS TIRUPATI MEETING ON FLOODS) సమీక్ష నిర్వహించారు. బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

minister peddi reddy
minister peddi reddy

By

Published : Nov 24, 2021, 3:09 PM IST

వరదలపై తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో మంత్రులు సమీక్ష(YSRCP MINISTERS MEETING ON FLOODS) నిర్వహించారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటోందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ప్రస్తుతం వరద నష్టం అంచనా వేస్తున్నామని తెలిపారు.

ఊహించని రీతిలో నీరు రావడం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు తెగిందన్న పెద్దిరెడ్డి.. నష్టపోయిన ప్రతి కుటుంబానికీ పరిహారం ఇస్తామని చెప్పారు. అధికారంలోకి రావాలన్న ధ్యాసతోనే ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని, తెదేపా గెలిచాక పరిహారం ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details